Viral News: అలా ఎలా దూరావ్ నాగన్న..
Viral News: పాము పేరు వినగానే చాలామంది భయంతో వణికిపోతారు. అలాంటిది ఇంట్లోనే, అదీ వంటగదిలో అత్యంత ప్రమాదకరమైన పాము దాక్కుని ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పెద్దపెల్లి జిల్లా రామగుండంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. వంట పనుల్లో నిమగ్నమైన ఓ మహిళకు గ్యాస్ సిలిండర్ కింద కనిపించిన చిన్న అనుమానం చివరకు భారీ షాక్‌గా మారింది. విద్యుత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇంట్లో సాధారణంగా వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ కింద నుంచి తోక మాదిరిగా ఏదో భాగం బయటకు కనిపించింది. తొలుత అది బల్లి లేదా మరో చిన్న జీవి అయి...