EV Vehicle: ఓలా స్కూటర్ హల్చల్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 176 కిలోమీటర్లు
EV Vehicle: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం అధికంగా ఇంధన ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. నెలకు వేల రూపాయలు ఇంధనానికే ఖర్చవుతుండటంతో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారుల ఆసక్తి వేగంగా పెరుగుతోంది. తక్కువ నిర్వహణ ఖర్చు, తక్కువ ప్రయాణ వ్యయం, ఆధునిక సాంకేతికత వంటి కారణాలతో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యంతో ఈ...