Science: గుప్త నిధులపై పాముల కాపలా.. నిజమా..?

Science: పాత కోటలు, పాడుబడిన రాజభవనాలు, నేలమాళిగల్లో దాచిన గుప్తనిధులపై నాగుపాములు కాపలా కాస్తాయనే నమ్మకం భారతదేశంలో శతాబ్దాలుగా ప్రచారంలో ఉంది. జానపద కథలు, పురాణాలు, సినిమాలు ఈ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. ముఖ్యంగా గుప్తనిధులు తవ్వేందుకు వెళ్లినప్పుడు అక్కడ పాములు కనిపిస్తే, అవే ఆ నిధిని కాపాడుతున్నాయనే భావన చాలా మందిలో ఏర్పడింది. అయితే శాస్త్రవేత్తలు, వన్యప్రాణి నిపుణులు మాత్రం దీనిని పూర్తిగా అపోహగానే కొట్టిపారేస్తున్నారు. పాములు ధనాన్ని కాపాడతాయనే నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో నాగుపాములకు ప్రత్యేక స్థానం ఉంది. పురాణాల్లో నాగలోకం సంపదకు నిలయమని, అక్కడ అమూల్యమైన మణులు, ధనరాశులు ఉంటాయని చెప్పబడింది. ఈ...