Crime: అర్ధరాత్రి భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య

Crime: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో కుటుంబ విభేదాలు అత్యంత దారుణ మలుపు తిరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధంపై ఉన్న అనుమానాలు, దంపతుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చివరకు ఊహించని హింసాత్మక ఘటనకు దారితీశాయి. ఈ ఘటనలో భార్య తన భర్తపై అత్యంత క్రూరంగా దాడి చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రాజేష్ కౌశిక్‌గా గుర్తించగా, ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. వృత్తిరీత్యా మేస్త్రీగా పనిచేస్తున్న రాజేష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితురాలిగా గుర్తించిన ద్రౌపతి బాయి మరియు ఆమె భర్త రాజేష్ మధ్య...