America- Iran: హర్మూజ్ జలసంధిలో అమెరికా బలగాల విధ్వంసం!
America- Iran: అమెరికా- ఇరాన్ మధ్య అధికారికంగా కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెబుతుండగా, మరోవైపు వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాల్లో సైనిక కదలికలు, పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతోంది. తాజాగా సోమవారం మే 25న చోటుచేసుకున్న పరిణామాలు ఈ ఉద్రిక్తతలకు మరింత బలం చేకూర్చాయి. దక్షిణ ఇరాన్ పరిధిలోని హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో అమెరికా సైన్యం లక్ష్యిత దాడులు నిర్వహించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన సైనిక వనరులు...