Garuda Purana: చనిపోయిన మనిషి ఆత్మ రాత్రి పూట ఇంట్లోనే తిరుగుతుందా..?
Garuda Purana: చనిపోయిన వ్యక్తి ఆత్మ రాత్రి సమయంలో ఇంట్లోనే తిరుగుతుందా? సూర్యాస్తమయం కాకముందే ఎందుకు అంత్యక్రియలు నిర్వహిస్తారు? అనే ప్రశ్నలు చాలా కాలంగా ప్రజల్లో చర్చకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందూ సంప్రదాయాల్లో మరణం, ఆత్మ, దహన సంస్కారాలపై ఎన్నో విశ్వాసాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలో చెప్పబడిన అంశాలను ఆధారంగా తీసుకుని చాలామంది అంత్యక్రియల సమయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఇవి మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా ఉన్న అభిప్రాయాలేనని గుర్తుంచుకోవాలి. హిందూ సంప్రదాయాల ప్రకారం జననం, మరణం అనేవి జీవన చక్రంలో భాగాలుగా భావిస్తారు. మనిషి శరీరం నశ్వరమైనదే అయినా ఆత్మ మాత్రం శాశ్వతమనే భావన పురాణాల్లో...