Money Lessons: పిల్లలకు నేర్పించాల్సిన స్మార్ట్ మనీ లెసన్స్ ఇవే..!
Money Lessons: ప్రస్తుత కాలంలో పిల్లలకు కేవలం పాఠ్యపుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా ఆర్థిక అవగాహన కూడా సమానంగా అవసరమవుతోంది. భవిష్యత్తులో వారు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా ఎదగాలంటే చిన్నప్పటి నుంచే డబ్బు విలువ, ఖర్చు విధానం, పొదుపు అవసరం, అవసరాలు- కోరికల మధ్య తేడా వంటి అంశాలను అర్థమయ్యేలా నేర్పించడం ఎంతో కీలకం. పిల్లలు పెద్దయ్యాక ఆర్థిక సమస్యలను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి చేరుకోవాలంటే కుటుంబమే మొదటి శిక్షణా కేంద్రంగా మారాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత ప్రధానమైనది. వారు చెప్పే మాటలకన్నా చేసే పనులే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే ఇంట్లోనే ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన అలవాట్లను పెంపొందించడం...