Palakurthi Sarangapani: రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్

Palakurthi Sarangapani: భారతదేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా సంస్కరణలను అమలు చేసిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో గురువారం నిర్వహించిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాలకుర్తి సారంగపాణి.. దేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లడంలో రాజీవ్ గాంధీ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం దేశ...