Andhra Pradesh: పగలు గౌరవప్రదమైన ఉద్యోగం.. రాత్రిపూట..!

Andhra Pradesh: రైల్వే శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో పనిచేస్తూ ప్రయాణికుల భద్రతకు తోడ్పడాల్సిన ఓ అధికారి, అదే వ్యవస్థలోని సౌకర్యాలను దుర్వినియోగం చేసి దొంగతనాలకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. కర్నూలు రైల్వే సర్కిల్ పరిధిలో వెలుగుచూసిన ఈ వ్యవహారం రైల్వే ప్రయాణికుల్లో ఆందోళనకు దారితీసింది. సాధారణంగా ప్రయాణికులకు సహాయం చేయాల్సిన ఉద్యోగి, వారినే లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి.బాలరాజు (36) ఆదోనిలో రైల్వే జూనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉద్యోగ రీత్యా తరచుగా రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉండటంతో ఆ సౌకర్యాన్ని నిందితుడు నేరాలకు వినియోగించినట్లు విచారణలో తేలింది. గత...