WDCC President: హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ అయూబ్

WDCC President: పవిత్ర హజ్ యాత్రను పురస్కరించుకుని ఈనెల 27న హైదరాబాద్ నుంచి మక్కా, మదీనాలకు బయలుదేరనున్న హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ హజ్ హౌస్ నుంచి మంగళవారం ఆధ్యాత్మిక యాత్ర కోసం బయలుదేరనున్న యాత్రికులు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో పవిత్ర మక్కా, మదీనాలకు ప్రయాణించనున్నారు. ఈ పవిత్ర యాత్రకు వెళ్తున్న భక్తులు దేశం, రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని పలు వర్గాలు కోరుతున్నాయి. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర హజ్ యాత్రకు అవకాశం...