Aruri Ramesh: గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా పండుగ

Aruri Ramesh: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డిసి తండలో మంగళవారం నిర్వహించిన దుర్గమ్మ, ఎల్లమ్మ తల్లి పండుగ వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచాయి. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ.. డిసి తండ గ్రామ ప్రజలు ఎంతో భక్తి విశ్వాసాలతో అమ్మవారి పండుగను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయ పండుగలు ప్రజల్లో ఐక్యత, ఆధ్యాత్మిక భావనలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దుర్గమ్మ, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ...