Woman Harassment: నడిరోడ్డుపై మహిళ డ్రెస్సును పైకి లేపిన సైకో (VIDEO)
Woman Harassment: హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న మణికొండ, అల్కాపూర్ టౌన్షిప్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో, పట్టపగలే ఓ మహిళ పట్ల జరిగిన అసభ్య ప్రవర్తన మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాల వార్తలు వినిపించే ఈ ప్రాంతంలో ఇప్పుడు మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వికృత చేష్టలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. సమాచారం ప్రకారం మణికొండలోని అల్కాపూర్ టౌన్షిప్ రోడ్డు నంబర్ 4లో ఉన్న ప్రణతి ఈషా అపార్ట్మెంట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన చిన్నారితో కలిసి...