BCCI: మే 20 నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్స్ టికెట్ల అమ్మకాలు
BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంటుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. లీగ్ దశ మ్యాచ్లు ముగింపుకు చేరువవుతున్న వేళ ప్లేఆఫ్స్ సమరానికి సంబంధించిన టికెట్ల విక్రయ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్లేఆఫ్స్ మ్యాచ్లకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండనున్న నేపథ్యంలో అభిమానులు టికెట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ప్లేఆఫ్స్ టికెటింగ్ బాధ్యతలను ప్రముఖ ఆహార సరఫరా సంస్థకు చెందిన ప్రత్యేక వేదిక నిర్వహించనుంది. జొమాటోకు చెందిన “డిస్ట్రిక్ట్ బై జొమాటో” వేదిక ద్వారా టికెట్ల విక్రయాలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్లేఆఫ్స్ టికెట్ల...