Aruri Ramesh: డిజిటల్ సభ్యత్వ నమోదు కోసం ఇంచార్జిల నియామకం
Aruri Ramesh: వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం, డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సమావేశంలో ప్రతి డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఇంచార్జిలను నియమించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలపర్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపునిచ్చారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 1వ డివిజన్‌కు తోటకూరి శ్రీధర్‌ను, 2వ డివిజన్‌కు...