SSC Batch: వర్ధన్నపేటలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
25 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగ క్షణాలు గురువులను ఘనంగా సత్కరించిన పూర్వ విద్యార్థులు 2000-2001 బ్యాచ్ రీయూనియన్ ప్రత్యేక ఆకర్షణ స్నేహబంధాలను గుర్తు చేసిన ఆత్మీయ సమావేశం SSC Batch: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఎన్నో ఏళ్ల అనంతరం కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడంతో పాఠశాల ప్రాంగణం భావోద్వేగ క్షణాలతో నిండిపోయింది....