Eega Mallesham: సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కేవలం ‘విద్య’తోనే సాధ్యం
Eega Mallesham: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ పోచయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈగ మల్లేశం.. చదువు అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదని, అది మనిషికి విజ్ఞానం, వినయం, సంస్కారం నేర్పించే గొప్ప శక్తి అని పేర్కొన్నారు. సమాజంలో ఎలా మెలగాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సొంత కాళ్లపై ఎలా నిలబడాలి అనే విషయాలను విద్య నేర్పుతుందని తెలిపారు. చదువు మనిషిని బాధ్యతాయుత...