Sudhakar Goud: ఇంధన ధరల పెంపు.. కేంద్రంపై బండి సుధాకర్ గౌడ్ ఆగ్రహం

Sudhakar Goud: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి మరియు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ దేశ ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను కేవలం పన్నులు చెల్లించే వనరులుగానే చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో సామాన్య ప్రజలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో మరోసారి ఇంధన ధరలను పెంచడం ప్రజల జీవితాలను మరింత సంక్షోభంలోకి నెట్టిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మధ్యతరగతి...