Narendra Modi: LPG, పెట్రోలియం రంగాల్లో భారత్-యూఏఈ మధ్య బిగ్ డీల్!

Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 5 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మధ్య జరిగిన ఈ పర్యటన భారత్‌కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కీలక మలుపుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇంధన భద్రత, రక్షణ సహకారం, పెట్టుబడుల విస్తరణ వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరడం విశేషంగా మారింది. మే 15న అబుదాబి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం...