Natural Gas: LPG, CNG, PNG, LNG మధ్య తేడా ఏంటో తెలుసా?

Natural Gas: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు సరఫరా తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్‌లో కూడా ఎల్పీజీ అందుబాటు, ధరలపై చర్చ మొదలైంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా సహజ వాయువు, ఎల్పీజీ, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, పీఎన్‌జీ వంటి పదాలు తరచుగా వినిపిస్తున్నప్పటికీ వీటి మధ్య తేడాలు చాలామందికి స్పష్టంగా తెలియవు. ఇవన్నీ గ్యాస్ రూపంలో ఉన్నప్పటికీ తయారీ విధానం, నిల్వ పద్ధతి, వినియోగం పరంగా గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. సహజ వాయువు అనేది భూమి లోపల సహజంగా ఏర్పడే శిలాజ ఇంధనం....