Aruri Ramesh: సామాన్యుడికి ఒక చట్టం.. కేంద్ర మంత్రి కుమారుడికి మరో చట్టమా?

పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా రక్షిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్, కేంద్ర బీజేపీ!.. అధికార మదంతో కేసులను నీరుగార్చడం మహిళా లోకానికే అవమానం. న్యాయం అందరికీ ఒక్కటే ఉండాలి.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి! వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ డిమాండ్ Aruri Ramesh: తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు ఒక చట్టం.. ప్రముఖులకు మరో చట్టం అమలవుతుందా..? అని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి బుధవారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి వర్ధన్నపేట...