Councilor Suresh: చిన్నారులకు బాలామృతం పంపిణీ
Councilor Suresh: వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 7వ డివిజన్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ 4వ యూనిట్లో మంగళవారం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాలామృతం, కోడిగుడ్లు, పప్పు, బియ్యం వంటి పౌష్టికాహార పదార్థాలను అందజేశారు. స్థానిక ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెంచడంతో పాటు చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కౌన్సిలర్ తిరుపతి సురేష్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పౌష్టికాహార వస్తువులను పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ చంద్రమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో...