Wardhannapet: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
భక్తులతో కిటకిటలాడిన ఆంజనేయ స్వామి ఆలయం భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామి ఆరాధన తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల రాక Wardhannapet: హనుమాన్ జయంతి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయం మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగాయి. భక్తులు నియమనిష్ఠలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి పవిత్ర అభిషేకాలు, ఆకు పూజలు వైభవంగా నిర్వహించారు. పూజారులు వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక...