Hanuman Jayanti 2026: హనుమంతుడి మహిమను చాటే పర్వదినం

Hanuman Jayanti 2026: భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అపారమైన భక్తి, అసాధారణ శక్తి, అచంచలమైన నమ్మకానికి ప్రతీకగా కొలవబడే ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అయితే ప్రాంతానికో ఆచారం, సంప్రదాయానికో ప్రత్యేకత ఉండటంతో హనుమాన్ జయంతి వేడుకలు వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన తేదీల్లో జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వైశాఖ మాసం కృష్ణ పక్ష దశమి తిథినే తెలుగు హనుమాన్ జయంతిగా భావిస్తూ శతాబ్దాలుగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో మే 12వ తేదీ మంగళవారం తెలుగు హనుమాన్ జయంతి పర్వదినంగా భక్తులు ఘనంగా జరుపుకోనున్నారు. పంచాంగ వివరాల...