Mumbai Indians: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్ బై?
Mumbai Indians: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. వరుస ఓటములతో కుంగిపోయిన ఈ జట్టు ప్లేఆఫ్స్ పోటీలో నుంచి దాదాపు బయటపడినట్టే కనిపిస్తోంది. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఉధృతమయ్యాయి. జట్టు ఇంత దారుణంగా ఆడుతున్నప్పటికీ అతడినే కెప్టెన్గా కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్న పెద్ద చర్చగా మారింది. జాతీయ స్థాయిలో వస్తున్న సమాచారం ప్రకారం జట్టు యాజమాన్యం ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. 2024 నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు పరిస్థితులు అనుకూలంగా మారడం లేదు. ఆ...