IPL Ticket Scam: ఐపీఎల్ టికెట్ల కోసం నకిలీ హైకోర్టు జడ్జిలమని ఫోన్ కాల్స్
IPL Ticket Scam: హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ మ్యాచ్ల సందడి నెలకొన్న వేళ, క్రికెట్ అభిమానులు స్టేడియంకు తరలివస్తున్న సమయంలో కొందరు కేటుగాళ్లు అదే అవకాశాన్ని దోపిడీకి వాడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతుండగా, టికెట్ల కోసం భారీ డిమాండ్ ఉండటాన్ని ఆసరాగా తీసుకుని ఒక ముఠా అత్యంత చాకచక్యంగా మోసాలకు పాల్పడింది. ప్రధానమంత్రి కార్యాలయం, గవర్నర్ కార్యాలయం పేర్లను దుర్వినియోగం చేస్తూ నకిలీ లేఖలు సృష్టించి, తాము ఉన్నతాధికారులమంటూ చెప్పుకుంటూ టికెట్లు సంపాదించేందుకు ప్రయత్నించిన ఈ వ్యవహారం నగరంలో సంచలనంగా మారింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి...