Nandini Sharma: టీ20 జట్టులో మరో ఆణిముత్యం

Nandini Sharma: భారత మహిళల క్రికెట్‌లో ప్రస్తుతం ఒక యువ మహిళా ప్లేయర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆ పేరు నందినీ శర్మ. 2001 సెప్టెంబర్ 20న చండీగఢ్‌లో జన్మించిన ఈ యువ బౌలర్ తక్కువ ధరకు జట్టులోకి వచ్చినప్పటికీ తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో కేవలం రూ.20 లక్షల కనీస ధరకు ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్న నందినీ, తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లీగ్‌లో ఆడిన 10 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీసి తన ప్రతిభను చాటుకుంది. అదే టోర్నీలో హ్యాట్రిక్ వికెట్లు సాధించడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టిన తొలి...