Numerology: మీ పుట్టిన తేదీ ఇదేనా?.. కోటీశ్వరులు కావడం ఖాయం!

Numerology: పుట్టిన తేదీ మన జీవితంపై ప్రభావం చూపుతుందనే నమ్మకం చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా సంఖ్యాశాస్త్రంలో జన్మతేదీ ఆధారంగా వ్యక్తి స్వభావం, ఆర్థిక ప్రగతి, అదృష్టం, విజయావకాశాల గురించి విశ్లేషణ చేస్తారు. కొందరు పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉంటారని, చిన్న వయసులోనే మంచి అవకాశాలు వారి జీవితంలోకి వస్తాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. కృషి, పట్టుదల, తెలివితేటలు కలిసివస్తే అలాంటి వారు సంపదను మాత్రమే కాదు, సమాజంలో మంచి పేరు, ప్రతిష్టను కూడా సంపాదిస్తారని విశ్వసిస్తారు. ముఖ్యంగా కొన్ని తేదీల్లో జన్మించినవారిపై లక్ష్మీదేవి ప్రత్యేక కటాక్షం ఉంటుందని చాలామంది నమ్మకం వ్యక్తం చేస్తుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారు సూర్య...