China: కొత్త ట్రెండ్.. బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే డబ్బులు కట్టి మరీ జైలుకు వెళ్లాల్సిందేనట!
China: బరువు తగ్గడం కోసం జిమ్‌లు, డైట్ ప్లాన్లు, యోగా కేంద్రాలు విన్నవే కానీ జైలుకెళ్లి బరువు తగ్గడం అనేది చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించే విషయం. కానీ చైనాలో మాత్రం ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. అక్కడ వందలాది మంది యువతీ యువకులు స్వచ్ఛందంగా ఫీజు చెల్లించి ప్రత్యేక ఫ్యాట్ జైళ్లలో చేరుతున్నారు. ఇవి సాధారణ జైళ్లు కాకుండా ఊబకాయం తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యేక శిక్షణ శిబిరాలు. అయితే వీటి నిర్మాణం, నిర్వహణ చూస్తే నిజమైన కారాగారాలను తలపిస్తాయి. ఎత్తైన గోడలు, భారీ గేట్లు, నిరంతర సీసీ కెమెరాల నిఘా, కఠిన నియమాలతో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. ఒకసారి లోపల చేరితే నిర్ణయించిన...