Central Govt: రైల్వే క్రాసింగ్‌లకు ఇక చెక్..

Central Govt: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు వెళ్లే సమయంలో గేట్లు మూసివేయడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడం, అత్యవసర సేవలకు అంతరాయం కలగడం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై కేంద్ర రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కలిసి నిర్వహించిన కామన్ మీటింగ్‌లో సమగ్ర చర్చ జరిపి అమలు దిశగా ముందడుగు వేశారు. రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించే క్రమంలో అధికారులు మొత్తం 203 కీలక...