Kakanmath Temple: దెయ్యాలు నిర్మించిన దేవాలయం!.. ఎక్కడో తెలుసా?

Kakanmath Temple: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరెనా జిల్లా సిహోనియా ప్రాంతంలో ఉన్న కాకన్‌మఠ్ దేవాలయం భారతదేశంలోని అత్యంత విశేషమైన చారిత్రక కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. సుమారు 115 అడుగుల ఎత్తులో ఆకాశాన్ని తాకేలా నిలిచిన ఈ ఆలయంలో శివుడు ప్రతిష్ఠించబడి ఉండగా, దాని నిర్మాణ శైలి చూసిన వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలయానికి వెళ్లే మార్గం అంతా పురాతన స్తంభాలు, విరిగిపోయిన విగ్రహాలు, రాళ్ల అవశేషాలతో నిండిపోవడం అక్కడి చరిత్ర వైభవాన్ని గుర్తుచేస్తుంది. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్, గార లేదా సున్నం వంటి అంటుకునే పదార్థాలు ఉపయోగించకపోవడం విశేషం. కేవలం భారీ రాళ్లను ఒకదానిపై ఒకటి ఖచ్చితంగా అమర్చడం ద్వారానే ఇంత...