Spirituality: కల్కి అవతారం రాబోతుందా?.. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం విశేషాలు
Spirituality: భూమిపై అన్యాయం అధికమైపోయినప్పుడు దాన్ని సరిచేయడానికి దైవం అవతరిస్తుందనే విశ్వాసం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఎంతో కాలంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ఉన్న కలియుగం చివరి దశకు చేరుకుందని, త్వరలోనే మహావిష్ణువు పదో అవతారమైన కల్కి అవతారం భూమిపై అవతరిస్తాడని అనేక పురాణాలు సూచిస్తున్నాయి. కేవలం పురాణ గ్రంథాలే కాకుండా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానం, అలాగే ఒడిశాకు చెందిన అచ్యుతానంద దాస్ రూపొందించిన భవిష్య మాలిక వంటి గ్రంథాలు భవిష్యత్తులో సంభవించబోయే సంఘటనలపై గంభీర హెచ్చరికలు చేస్తూ ప్రజల్లో ఆసక్తి, ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ గ్రంథాల్లోని వివరణల ప్రకారం.. ప్రపంచం ఒక మహా సంక్షోభాన్ని ఎదుర్కొనే దశకు చేరుకుంటుందని పేర్కొంటాయి. ముఖ్యంగా...