Viral News: వింత ఘటన.. పంది కడుపులో ఏనుగు పిల్ల అవతారం!
Viral News: నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో జరిగిన ఈ సంఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే రైతు పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. తన ఇంటి ఆవరణలో చిన్న పందిరి నిర్మించి పశుపోషణ ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు ఇటీవల జరిగిన సంఘటన అనుకోని షాక్‌ను మిగిల్చింది. ఆయన పెంచుతున్న ఒక పంది మొదటి ఈతలో మొత్తం 7 పిల్లలకు జన్మనిచ్చింది. ప్రారంభంలో ఈ విషయంతో సంతోషించిన వెంకటయ్య, కొద్దిసేపటికి ఒక పంది పిల్ల ఆకారం చూసి విస్తుపోయాడు. ఆ 7 పిల్లల్లో ఒకటి సాధారణ...