Telangana: ‘సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి’?.. కొండగట్టు అంజన్న హుండీలో భక్తుల లేఖలు
Telangana: భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఒక అరుదైన, వినూత్న నిరసన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ హుండీల్లో నగదు కానుకలు సమర్పిస్తారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. డబ్బులకు బదులుగా భక్తులు తమ ఆవేదనను అక్షరాల రూపంలో వ్యక్తం చేస్తూ లేఖలను హుండీల్లో వేసి నిరసన తెలపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. “సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి?” అంటూ భక్తులు స్పష్టంగా ప్రశ్నించిన తీరు ఆలయ నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది. ఇటీవల నిర్వహించిన హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు 16 రోజుల పాటు ఘనంగా జరిగాయి....