Snake Rescue: ఏంటీ మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా..

Snake Rescue: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాములు జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చల్లని ప్రదేశాల కోసం పాములు ఇళ్లలోకి రావడం ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నది. ఇలాంటి పరిణామాలు ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకా హలవల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. సుమారు 16 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఒక ఇంట్లోకి చేరి తిష్టవేసింది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పామును చూసిన వెంటనే భయంతో పరుగులు తీశారు. ఈ విషయం...