Coconut Chutney: కొబ్బరి చట్నీతో ఇన్ని లాభాలా?.. తెలిస్తే మొత్తం నాకేస్తారు

Coconut Chutney: దక్షిణ భారతీయ అల్పాహార సంప్రదాయంలో కొబ్బరి చట్నీకి ప్రత్యేక స్థానం ఉంది. వేడి వేడి ఇడ్లీలు, కరకరలాడే దోసెలకు ఈ చట్నీ కలిస్తే ఆ రుచి మరింత మెరుగవుతుంది. అయితే ఇటీవల కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే భయం, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయనే అపోహల కారణంగా చాలా మంది కొబ్బరి చట్నీకి దూరంగా ఉంటున్నారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం.. కొబ్బరిలో ఉండే కేలరీలు శరీరానికి హానికరమైనవి కాకుండా ఉపయోగకరమైనవే. ఇవి శరీర జీవక్రియను వేగవంతం చేసి రోజంతా శక్తివంతంగా ఉండేలా సహాయపడతాయి. అందువల్ల కేవలం రుచికోసం మాత్రమే కాకుండా ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా కొబ్బరిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని...