Wheat Storage: గోధుమలకు పురుగు పట్టిందా.. ఈ టిప్స్‌తో అన్ని చస్తాయ్

Wheat Storage: గోధుమలను ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు చాలా మంది రసాయనాలతో తయారైన ప్రమాదకర పురుగుమందులను ఆశ్రయిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఇవి ధాన్యాన్ని కాపాడుతున్నట్టు కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మన పూర్వీకులు అనుసరించిన సహజ పద్ధతులు గోధుమలను సురక్షితంగా, నాణ్యత కోల్పోకుండా నిల్వ చేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో, ఎలాంటి రసాయనాల అవసరం లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో గోధుమలను రక్షించుకోవడం సాధ్యమవుతుందని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా వంటగదిలో ఉండే సాధారణ వస్తువులే ధాన్యాన్ని కీటకాలు, పురుగుల నుండి కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని...