Celebrations: సిద్ధిపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
స్టార్ త్రినేత్రం, సిద్ధిపేట: సిద్ధిపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధిపేట శాసన సభ్యులు హరీష్ రావు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమూల్యమైనవని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. యువత అంబేద్కర్ ఆశయాలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సభ్యులు ఆస లక్ష్మణ్, డీలర్ శంకర్, రామకృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వారు...