Telangana Politics: కవిత ‘బ్లూ వార్’ సిద్ధం!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపేలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటుపై వేగం పెంచారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భావ తేదీని ప్రకటించిన ఆమె.. తాజాగా పార్టీ జెండా రంగును వెల్లడిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యారు. తమ పార్టీ జెండాలో నీలి రంగుకు ప్రధాన ప్రాధాన్యత ఉంటుందని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసిన కవిత.. ఈ రంగు తమ దార్శనికతను, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ‘కలర్ థియరీ’ అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించడంతో కొత్త పార్టీ అజెండాపై మరింత ఆసక్తి పెరిగింది. కొత్త పార్టీ పేరుపై...