Journalism: ఎవరు జర్నలిస్ట్?.. ఎవరికి అక్రిడిటేషన్?
అక్రిడిటేషన్పై పెరుగుతున్న వివాదం ప్రభుత్వ పాత్రపై విమర్శలు చిన్న మీడియా ఇబ్బందులు Journalism: ప్రజాస్వామ్యంలో కీలక స్థానాన్ని కలిగిన పాత్రికేయ వ్యవస్థపై ఇటీవలి కాలంలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టు అంటే ఎవరు అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డు ఉన్న వారినే నిజమైన జర్నలిస్టులుగా భావిస్తుండగా, మరికొందరు అది కేవలం ఒక సౌకర్యం మాత్రమేనని, జర్నలిజానికి అసలు ప్రమాణం కాదని వాదిస్తున్నారు. ఈ విభిన్న అభిప్రాయాల నడుమ పాత్రికేయ వృత్తి అసలు స్వరూపం ఏమిటి అనే చర్చ మరింత వేడెక్కుతోంది. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల తర్వాత నాలుగో స్తంభంగా గుర్తింపు పొందిన ఈ వృత్తి సమాజానికి...