Gas Cylinder: 5 కేజీల సిలిండర్‌పై కేంద్రం మరో కీలక నిర్ణయం
Gas Cylinder: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేయబడటంతో గ్యాస్, చమురు రవాణా దెబ్బతింది. ఈ పరిణామం నేరుగా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడే భారతదేశంపై ప్రభావం చూపుతోంది. దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తి, సరఫరాను పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ సంస్థలు 5 కేజీల చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టగా, ఇవి తక్కువ కాలంలోనే ప్రజల్లో విపరీత ఆదరణ పొందాయి. దేశవ్యాప్తంగా...