Jos Buttler: అర్థశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్

Jos Buttler: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక పోరులో జోస్ బట్లర్ అద్భుత ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 37 బంతుల్లోనే 60 పరుగులు సాధించిన ఆయన ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. చాలా రోజులుగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న బట్లర్, సరైన సమయంలో తన ప్రతిభను చాటుకోవడం ద్వారా జట్టుకు కీలక విజయం అందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆయన.. మళ్లీ పరుగుల వేటలోకి రావడం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా తన ప్రదర్శనపై ఆందోళన కలిగిందని అంగీకరించిన ఆయన, ఈ ఇన్నింగ్స్ ద్వారా తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందినట్లు తెలిపారు. ఈ మ్యాచ్ ద్వారా...