Telangana: డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్‌లో ప్రభుత్వం మార్పులు
Telangana: తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటి వరకు లైసెన్స్ పొందాలంటే తప్పనిసరిగా రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అక్కడ మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం వల్ల అవినీతి పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని, పారదర్శకతను పెంచడం, ప్రజలకు సులభమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఫేస్‌లెస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానంలో డ్రైవింగ్ టెస్ట్ తప్ప మిగతా అన్ని సేవలను ఇంటి దగ్గర నుంచే పొందే అవకాశం కల్పించనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెక్ట్స్ జెన్ ఎంపరివాహన్ డిజిటల్ వేదిక ద్వారా వాహనదారులకు ఒకే చోట అన్ని...