Snake Plant: ఈ మొక్క పాములను అట్రాక్ట్ చేస్తుందా?.. నిజమెంత
Snake Plant: స్నేక్ ప్లాంట్ అనే పేరు వినగానే చాలా మంది భయపడుతూ, ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే పాములు వస్తాయేమో అనే అనుమానం కలుగుతుంది. అయితే ఈ భయం పూర్తిగా అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ మొక్క ఆకులు పొడవుగా, నిటారుగా పెరిగి వాటిపై కనిపించే చారలు పాము చర్మాన్ని పోలి ఉండటం వల్లే దీనికి ఆ పేరు వచ్చింది. కానీ ఈ మొక్కకు పాములతో ఎటువంటి సంబంధం లేదని శాస్త్రీయంగా కూడా నిర్ధారించబడింది. సామాజికంగా వ్యాపించిన ఈ అపోహల వల్ల చాలా మంది ఈ మొక్కను దూరంగా ఉంచుతున్నా, వాస్తవానికి ఇది ఎంతో ఉపయోగకరమైన ఇంటి మొక్కగా గుర్తింపు పొందింది....