Aadhaar: చనిపోయిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఎలా చేయాలో తెలుసా?
Aadhaar: మన దేశంలో ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతున్న ఆధార్ కార్డు మరణానంతరం కూడా యాక్టివ్‌గా కొనసాగడం అనేక ప్రమాదాలకు దారితీసే అంశంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా UIDAI పరిధిలో జారీ చేసే ఈ గుర్తింపు పత్రం చనిపోయిన వ్యక్తి పేరుతో యాక్టివ్‌గా ఉంటే ఆర్థిక మోసాలు, గుర్తింపు దొంగతనం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతాలు, సబ్సిడీలు, పెన్షన్ పథకాలు వంటి అంశాల్లో దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే మృతుల ఆధార్‌ను తక్షణమే డీయాక్టివేట్ చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అనుకోకుండా కుటుంబ సభ్యులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా రావచ్చు. మృతుల ఆధార్ యాక్టివ్‌గా...