Delhi: త్వరలో పెట్రోల్ వాహనాలు బ్యాన్..?

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ వాహనాల వినియోగానికి త్వరలోనే గుడ్‌బై చెప్పే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన కొత్త డ్రాఫ్ట్ ఈవీ పాలసీ 2026-30 ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా కనిపిస్తోంది. ఈ ముసాయిదా ప్రకారం పెట్రోల్ ఆధారిత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా పూర్తిగా తొలగించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ప్రణాళికలో భాగంగా 2027 జనవరి నుంచి కొత్తగా పెట్రోల్ త్రీ-వీలర్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని, 2028 ఏప్రిల్ నుంచి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై పూర్తిస్థాయి నిషేధాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇది ముసాయిదా దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే దృష్టి సారించబడుతోందని...