Spiritual: అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం కొనుగోలు చేయాలా?
Spiritual: అక్షయ తృతీయ పర్వదినం సమీపిస్తోంది. 2026లో ఈ పవిత్రమైన రోజు ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. అయితే నిజంగా ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనాలా? లేక దాని వెనుక ఉన్న అసలు భావం ఏమిటి? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయ అత్యంత శుభదాయకమైన రోజు గా భావిస్తారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తృతీయ తిథిన ఈ పండుగను జరుపుకుంటారు. “అక్షయం” అనే పదానికి “ఎప్పటికీ తగ్గని, నశించని” అనే అర్థం ఉంది. అందుకే ఈ రోజు చేసే పుణ్యకార్యాలు, దానాలు, శుభారంభాలు...