Tollywood: చిరంజీవి తర్వాత మెగాస్టార్ ఎవరు?
Tollywood: టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఒక చరిత్రగా నిలిచిపోయింది. స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన ప్రతిభతో అగ్రస్థానానికి చేరుకుని కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో సంవత్సరాల పాటు తన నటన, నృత్యం, మాస్ ఇమేజ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన చిరంజీవి స్థాయి ప్రత్యేకమైంది. అయితే ఇప్పుడు కాలం మారింది. తెలుగు సినిమా పరిధి దేశవ్యాప్తంగా విస్తరించింది. భారీ బడ్జెట్ చిత్రాలు, కొత్త కథలు, ప్రపంచ స్థాయి సాంకేతికతతో హీరోలు పోటీగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చిరంజీవి తర్వాత టాలీవుడ్లో తదుపరి మెగాస్టార్ ఎవరు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ పోటీలో ప్రధానంగా...