Astrology: ఈ రాశుల వారిపై అష్టమ శని ప్రభావం.. కన్నీటితో గడపాల్సిందేనా?
Astrology: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో ప్రత్యేకమైనది. కర్మఫలదాతగా పరిగణించే శని, మనిషి చేసిన పనుల ఆధారంగా ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. ఇతర గ్రహాల మాదిరిగానే శని కూడా నిరంతరం రాశి మార్పులు చేస్తూ సంచరిస్తుంటాడు. ఈ సంచార దశల్లో అత్యంత ప్రభావవంతమైన దశగా భావించేది అష్టమ శని. ఈ దశ జాతకంలో ఉంటే అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జన్మ రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో శని సంచరిస్తే దానిని అష్టమ శని అని అంటారు. ఈ సమయంలో వ్యక్తి జీవితంలో అనుకోని మార్పులు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక...