West Bengal: క్లైమాక్స్‌కు చేరుకున్న అసెంబ్లీ ఎన్నికల పోరు.. మమతకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ హామీల వర్షం..
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. బెంగాల్ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ తాజాగా తన ఎన్నికల ప్రకటన పత్రాన్ని విడుదల చేసి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ ప్రకటనను విడుదల చేస్తూ ప్రజలకు పలు కీలక హామీలు ప్రకటించారు. చొరబాటుదారుల సమస్య నుంచి మహిళల సంక్షేమం వరకు అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఇచ్చిన హామీలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంటి పెద్దగా ఉన్న ప్రతి మహిళా ఖాతాలో ప్రతి నెలా రూ.3000 జమ చేస్తామని ప్రకటించడంతో...