Harassment: ఇన్‌స్టాలో క్లాస్‌మెంట్ వేధింపులు తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Harassment: హైదరాబాద్ నగరంలో విషాదాన్ని మిగిల్చిన ఓ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థి వేధింపులను తట్టుకోలేక 10వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుంట్లూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థిని, అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలుడితో పరిచయం ఏర్పరుచుకున్నట్లు సమాచారం. ప్రారంభంలో స్నేహంగా సాగిన ఈ పరిచయం తర్వాత సమస్యలకు దారి తీసింది. సోషల్ మీడియా ద్వారా ఆ బాలుడు ఆమెను అనుచితంగా వేధించడం ప్రారంభించినట్లు తెలిసింది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడం, వేధింపులు మరింత పెరగడం వల్ల ఆ బాలిక తీవ్రమైన మానసిక ఒత్తిడికి...